రాధేశ్యామ్‌.. 'ఆషికీ ఆ గయి' రొమాంటిక్ సాంగ్ విడుద‌ల‌

Aashiqui Aa Gayi Song Released from Radhe Shyam Movie.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం రాధే శ్యామ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2021 12:29 PM IST
రాధేశ్యామ్‌.. ఆషికీ ఆ గయి రొమాంటిక్ సాంగ్ విడుద‌ల‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్డే న‌టిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌వ‌న‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. తాజాగా 'ఆషికీ ఆ గ‌యీ' అంటూ సాగే హిందీ వెర్ష‌న్‌కు సంబంధించిన మొత్తం పాట‌ను విడుద‌ల చేశారు.

బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ ఉన్న డ్రెస్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. ఈ పాట‌లో విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండ‌గా.. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా క‌నిపించ‌బోతున్నాడు. యువి క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చాలా కాలం త‌రువాత ప్ర‌భాస్ రొమాంటిక్ జానర్ లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story