ఘ‌నంగా అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

Aamir Khan's daughter Ira gets engaged to BF Nupur Shikhare.అమీర్ ఖాన్ గారాల ప‌ట్టి ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుక‌లు ఘ‌నంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 9:47 AM IST
ఘ‌నంగా అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ గారాల ప‌ట్టి ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. త‌న చిర‌కాల ప్రియుడు నుపుర్ శిఖారేతో ఐరా ఖాన్ ఎంగేజ్‌మెంట్ న‌వంబ‌ర్‌18న ముంబైలో కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వైభ‌వంగా జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ నిశ్చితార్థ వేడుక‌లో ఐరా ఖాన్ ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయింది. ఇక నుపూర్ బ్లాక్ సూట్ ధ‌రించాడు. అమీర్ ఖాన్, అతని మాజీ భార్య కిరణ్ రోవా, మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్,అశుతోష్ గోవారికర్, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు వేడ‌క‌కు హాజ‌రు అయ్యారు.

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఫిట్‌నెస్ ట్రైన‌ర్ అయిన నుపుర్ శిఖారే తో ఐరా డేటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసే పార్టీల‌కు అటెండ్ అయ్యేవారు. ఇద్ద‌రు ప‌బ్‌లో సంద‌డి చేస్తున్న వీడియోలు గ‌తంలో ప‌లుమార్లు వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల ఓ సైక్లింగ్ ఈవెంట్‌లో నుపుర్ ఉంగ‌రం తీసుకొచ్చి మోకాళ్ల మీద కూర్చోని మ‌నం పెళ్లి చేసుకుందామా అని ఐరాను అడుగ‌గా అందుకు ఆమె అంగీక‌రించింది. ఆమె వేలికి ఉంగ‌రం తొడిగి త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రచగా.. అనంత‌రం ఐరా.. నుపూర్‌కు లిప్ కిస్ ఇచ్చి.. త‌న ప్రేమ‌ను తెలిపింది. అప్ప‌ట్లో ఆ వీడియో బాగా వైర‌ల్ అయ్యింది.

వీరిద్ద‌రి ప్రేమ‌కు ఇరు కుటుంబ స‌భ్యులు అంగీకారం తెల‌ప‌డంతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోనున్నారు.

Next Story