ఆమిర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్

Aamir khan tests corona positive.తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2021 2:03 PM IST
Aamir khan tests corona positive

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హమ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు కొవిడ్‌-19 ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో ప్ర‌స్తుతం ఆమిర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లార‌ని.. డాక్ట‌ర్ల సూచ‌న‌ల‌ను పాటిస్తున్నార‌ని ఆయ‌న అధికార ప్ర‌తినిధి తెలిపారు. ఇటీవ‌ల కాలంలో ఆమిర్‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా కోరారు. కాగా.. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్న‌ట్లు ఈ మ‌ధ్యే ఆమిర్ ఖాన్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆమిర్ ఖాన్ ప్ర‌స్తుతం 'లాల్ సింగ్ చాధా' చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24, 2021 న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ నెల మొదట్లో ఆమిర్ ఖాన్ ముంబైలో జరిగిన 'కోయీ జానే నా' మూవీ స్క్రీనింగ్ కు హాజరయ్యాడు. ఆయన ఆ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేశాడు. కాగా.. గ‌తేడాది ఆమిర్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్న 7 మంది ఉద్యోగులు, వారి భద్రతా సిబ్బంది, డ్రైవర్లు మరియు గృహనిర్వాహకులతో సహా కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. అప్పుడు అమీర్ ఖాన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది. పలుమార్లు టెస్ట్ చేయించుకున్న తర్వాత అమీర్ ఖాన్‌కు నెగెటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు వరుసగా బాలీవుడ్ ప్రముఖులు రణబీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, కార్తిన్ ఆర్యన్, సంజయ్ లీలా భన్సాలీ, వరుణ్ ధావన్, నీతు సింగ్ కూడా కరోనా బారిన ప‌డ్డారు.




Next Story