దయచేసి నా సినిమాను బాయ్‌కాట్‌ చేయకండి: అమీర్‌ఖాన్

Aamir khan reacts to boycott laal singh chaddha twitter trend. నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్దా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

By అంజి  Published on  1 Aug 2022 3:24 PM IST
దయచేసి నా సినిమాను బాయ్‌కాట్‌ చేయకండి: అమీర్‌ఖాన్

నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్దా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటించాడు. ఈ లేటెస్ట్‌ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. 1994లో హాలీవుడ్‌లో వచ్చిన ఫారెస్ట్ గంప్‌ మూవీకి రీమేక్‌.. ఈ సినిమా. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై అమీర్‌ఖాన్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌ కాకముందే.. సోషల్ మీడియాలో నెగిటివ్‌ ప్రచారం చేస్తుండటం అమీర్‌ను కలవరడ పెడుతోంది.

ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌ చద్దా ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై అమీర్‌ఖాన్ స్పందించారు. మీడియాతో ఇంటెరాక్ట్ అయిన స‌మ‌యంలో ఆయ‌న కొన్ని కామెంట్స్ చేశారు. ఇది తనకు చాలా బాధ కలిగించే విషయమని, కొందరు తనకు భారత్‌ అంటే నచ్చదన్న తప్పుడు ఉద్దేశంతో ఉన్నారని అమీర్ చెప్పాడు. కానీ అది నిజం కాదని, కొందరు అలా అనుకోవడం దురదృష్టకరమన్నాడు. దయచేసి తన సినిమాను బాయ్‌కాట్‌ చేయొద్దని, అందరూ సినిమా చూడండని అమీర్ వేడుకున్నాడు. ఈ సినిమాలో ఓ దివ్యాంగుడి పాత్రలో హీరో కనిపిస్తాడు. ఇందులో కరీనాకపూర్‌, మోనా సింగ్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.

Next Story