కూతురి పెళ్లిలో మాజీ భార్యతో అమిర్‌ఖాన్ ఇలా చేశాడేంటి? (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌కాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం చేసుకుంది. ప్రేమించిన వ్యక్తినే ఆమె పెళ్లాడారు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 3:43 PM ISTకూతురి పెళ్లిలో మాజీ భార్యతో అమిర్‌ఖాన్ ఇలా చేశాడేంటి? (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌కాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం చేసుకుంది. ప్రేమించిన వ్యక్తినే ఆమె పెళ్లాడారు. ఫిట్‌నెస్ ట్రైనర్ నపుర్ శిఖరే, అమిర్‌ఖాన్ కూతురు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే.. ఈ వివాహ వేడుక అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వివాహానికి అమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు కూడా వచ్చారు. ఆమె తన కూతురు ఆజాద్‌తో కలిసి వచ్చారు. వధూవరులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వివాహం అనంతరం రిసెప్షన్‌లో మాజీ బార్య కిరణ్‌రావుని అమిర్‌ఖాన్ పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. దగ్గరకు తీసుకుని స్టేజిపైనే చెంపపై ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ నిర్మాత కిరణ్‌రావుని అమిర్‌ఖాన్ పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా.. ఐరా, నుపుర్ శిఖరేల వివాహం రిజిస్ట్రర్ మ్యారేజ్ కావడంతో.. ఈ నెల 8న మరోసారి ఘనంగా వేడుకను నిర్వహించనున్నారు.ఆ తర్వాత జనవరి 13న ముంబైలో గ్రాండ్‌గా వివాహ విందు జరపనున్నట్లు తెలుస్తోంది.
Aamir Khan's ex-wife Kiran Rao smiles as he greets her with a kiss at daughter Ira Khan's wedding 🤗😘
— India Forums (@indiaforums) January 4, 2024
.
.
.#AamirKhan #KiranRao #IraKhan #IraKhanNupurShikhare #IraKhanNupurShikhare #IF #IndiaFourms #Bollywood #BollywoodStars pic.twitter.com/aYqceOKPVg