83 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎందులో అంటే..?

83 locks OTT release date.స్పోర్ట్స్-ఓరియెంటెడ్ డ్రామా మూవీ '83' విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ చిత్రం

By M.S.R  Published on  27 Jan 2022 8:31 AM GMT
83 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎందులో అంటే..?

స్పోర్ట్స్-ఓరియెంటెడ్ డ్రామా మూవీ '83' విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ చిత్రం మంచి రివ్యూలను పొందింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. రణవీర్ సింగ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు లభించినా కూడా పెద్దగా థియేటర్లకు జనాన్ని రప్పించడంలో సక్సెస్ కాలేక.. భారీగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. '83' సినిమా త్వరలో OTT లో సందడి చేయనుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రన్ చాలా కాలం క్రితం ముగిసింది. OTT విడుదల చేయనున్నారు. ఒరిజినల్ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుండగా, దక్షిణ భారత భాషా వెర్షన్‌లు (తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం డిస్నీ+ హాట్‌స్టార్‌లో వస్తాయి.కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, జీవా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో జీవించగా.. ఆయన భార్య పాత్రను దీపికా పదుకొణే పోషించింది. కరోనా కారణంగా ఈ సినిమా సరైన వసూళ్ళను దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయిన వారు ఓటీటీలో చూడాలనుకున్నారు. ఫిబ్రవరి 18న '83' సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ భారీగా వెచ్చింది కొనుగోలు చేసింది.

Next Story
Share it