కరోనా మహమ్మారి వల్ల చాలా రంగాలు నష్టపోయాయి. అయితే.. లాభపడిన రంగాల్లో ఓటీటీ ఒకటి. లాక్‌డౌన్, వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా ఓటీటీని చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. థియేటర్లలో విడుదలైన చిత్రాలు కేవలం రోజుల గ్యాప్‌లోనే రావడం, కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతుండడంతో వీటికి బాగానే ఆదరణ ఉంటోంది. ఇక నేడు ఓటీటీలో విడుదల కానున్న వెబ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం 'పుష్ప'. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. థియేటర్లలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొన్ని చోట్ల ఓ వైపు థియేటర్లలో ఈ చిత్రం నడుస్తుండగానే.. నేడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
నాగ శౌర్య హీరోగా నటించిన 'లక్ష్య' చిత్రం ఆహాలో, 'వరుడు కావలెను' చిత్రం జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నాయి. అదేవిధంగా బాలయ్య చేస్తున్న 'అన్ స్టాపబుల్ ' టాక్ షో నుండి కొత్త ఎపిసోడ్ కూడా నేడు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా 'ది టెండర్ బార్' అనే ఇంగ్లీష్ సిరీస్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో 'మదర్ ఆండ్రాయిడ్', 'లేట్ నైట్' అనే ఇంగ్లీష్ సినిమాలు, 'జానీ టెస్ట్', 'హైప్ హౌస్' అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.