2024: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు ఇవే

ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్‌ ట్రెండ్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్‌ నటించిన 'స్త్రీ-2' తొలిస్థానంలో నిలిచింది.

By అంజి  Published on  12 Dec 2024 4:46 AM GMT
trending searches, movies, Google

2024: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు ఇవే

ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్‌ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్‌ ట్రెండ్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్‌ నటించిన 'స్త్రీ-2' తొలిస్థానంలో నిలిచింది. హారర్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రూ.700 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో కల్కి2898AD, 12th ఫెయిల్‌, లాపతా లేడీస్‌, హనుమాన్‌, మహారాజ, మంజుమ్మల్‌ బాయ్స్‌, గోల్‌, సలార్‌, ఆవేశం టాప్‌ - 10లో నిలిచాయి.

అత్యధికంగా సెర్చ్‌ చేసిన లిస్ట్‌లో 'కల్కి 2898 AD' రెండో స్థానంలో ఉంది. టాలీవుడ్, బాలీవుడ్‌ ఆర్టిస్టులు నటించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తదితర సినీ ప్రముఖులు కీ రోల్స్‌ ప్లే చేశారు. ఆ తర్వాతి స్థానంలో '12th ఫెయిల్‌' సినిమా నిలిచింది . తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్ల సాధించిన ఈ చిత్రానికి మూడో స్థానం దక్కింది. ఈసారి ఆస్కార్ రేసుకు భారత్ నుంచి ‘లాపతా లేడీస్‌’ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఈ చిత్రానికి నాలుగో స్థానం దక్కింది.

యంగ్‌ హీరో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' ఐదో స్థానంలో నిలవగా, కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం విజయ్ సేతుపతి 'మహారాజా' ఆరో స్థానంలో ఉంది. మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌'కు ఏడో స్థానం, దళపతి విజయ్‌ నటించిన 'గోట్‌' చిత్రానికి ఎనిమిదో స్థానం దక్కింది. ఇక ప్రభాస్ నటించిన 'సలార్‌' 9వ స్థానం, ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' 10వ స్థానంలో నిలిచాయి.

Next Story