నిఖిల్ '18 పేజెస్' ఫస్టులుక్

18 Pages first look poster release.వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ఎంచుకుంటూ త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌ గుర్తింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 12:35 PM IST
నిఖిల్ 18 పేజెస్ ఫస్టులుక్

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ఎంచుకుంటూ త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌. ఆయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే.. ప్రేక్ష‌కులు కొత్త‌గా ఎదో ఉంటుంద‌ని ఆశిస్తారు. అందుకు త‌గ్గ‌ట్లే క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు నిఖిల్‌. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 18 పేజెస్‌. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది.

నేడు నిఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. సిద్దార్థ్ పాత్ర‌లో నిఖిలో, నందిని పాత్ర‌లో అనుప‌మ న‌టిస్తున్నట్లు చెప్పారు. నిఖిల్ కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఓ కాగితాన్ని ఉంచి.. దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు డిజైన్ చేసినన '18 పేజెస్' ఫస్ట్ లుక్ ఎంతోగానో ఆక‌ట్టుకుంటోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండ‌గా.. కథ, స్క్రీన్ ప్లే ను అందించింది సుకుమార్ కావడం విశేషం. గోపి సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story