ఆక‌ట్టుకుంటున్న నూటొక్క జిల్లాల అందగాడు ట్రైల‌ర్‌

101 Jillala Andagadu trailer Out.అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 101 జిల్లాల అందగాడు. సాగ‌ర్ రాచ‌కొండ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2021 7:36 AM GMT
ఆక‌ట్టుకుంటున్న నూటొక్క జిల్లాల అందగాడు ట్రైల‌ర్‌

అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 101 జిల్లాల అందగాడు. సాగ‌ర్ రాచ‌కొండ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ స‌ర‌స‌న రుహాని శర్మ న‌టిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో హీరో బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే పెళ్లి కాదని భావించి, విగ్గు పెడతాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గర ఆ నిజాన్ని దాచడానికి నానా తంటాలు పడుతుంటాడు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ మొత్తం పుల్ ఎంట‌ర్ టైనింగ్‌గా ఉంది. అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. రామ్, కిరణ్ గంటి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దిల్ రాజు, క్రిష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story
Share it