మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని వెంటాడుతున్న ‘సామజవరగమన’

By Newsmeter.Network  Published on  30 Nov 2019 10:05 AM GMT
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని వెంటాడుతున్న ‘సామజవరగమన’

సంక్రాంతికి పందెం కోళ్ల లాగా భారీ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలా వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ దాదాపు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ, ప్రిన్స్‌సంక్రాంతి సమరంలో తలపడటంతో రెండు సినిమాలు ప్రేక్షక అభిమానులను అలరించేందుకు మేకర్లు రెడీ అవుతున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సామజవరగమన, రాములో రాములా అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. అల వైకుంఠపురములోకు ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా సెప్టెంబర్ 27న తొలి పాటగా సామజవరగమనను విడుదల చేయగా 7.7 కోట్ల వ్యూస్ రాబట్టింది.

ఇక మరో నెల రోజుల తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 27న రాములో రాములా పాటను చిత్ర బృందం విడుదల చేయగా, యూట్యూబ్‌ లో ఇప్పటికే 4.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. రెండు పాటలు ప్రేక్షకాదరణను పొందడం 'సరిలేరు నీకెవ్వరు' సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పై ఒత్తిడి పెంచుతోంది. 'అల వైకుంఠపురములో' పాటలను మించి క్యాచీ ట్యూన్స్‌ ను ఇచ్చేందుకు దేవి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతున్నారు. కనీసం రెండు హిట్ పాటలైనా ఇవ్వాలని చిత్ర బృందం దేవిశ్రీని కోరారట. ఇక దేవిశ్రీ ఇప్పటికే సామజవరగమనకకు దీటైన మెలొడీని కంపోజ్ చేశారని సరిలేరు..బృందం త్వరలోనే దీన్ని ఆన్‌ లైన్‌ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ పాట 'సామజవరగమన, 'రాములో రాములా' సృష్టించిన మేనియాను తిరగరాస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

Next Story
Share it