హనీమూన్‌ కోసం టూరిస్టు స్థలానికి వచ్చిన ఓ జంటకు ఓ షాకింగ్‌ ఘటన ఎదురైంది. ఇండోనేషియాలోని బాలిలో ఇంగ్లండ్‌ జంట ఓ రిసార్టులో విడిదికి దిగింది. హనీమూన్‌ కూడా అక్కడే కొనసాగించాలని ప్లాన్‌ చేసుకుంది ఆ జంట. మూడు రోజుల పాటు రిసార్టులోని ఓ గదిలోనే గడిపారు. ఇంకేముందు భార్యాభర్తలిద్దరూ శృంగారంలో మునిగితేలారు. అంతేకాదు బయట డోర్‌కు డూనాట్‌ డిస్టర్బ్ అని బోర్డు కూడా తగిలించారు. ఇద్దరూ పగలు రాత్రి తేడా లేకుండా ఎంజాయ్‌ చేశారు. ఫైప్‌ స్టార్‌ రిసార్ట్‌ కావడంతో బాల్కనీలో మంచి నీటి కొలను కూడా ఉంది. అందులో ఇద్దరూ కలిసి స్నానాలు చేస్తూ ఎంజాయ్‌ చేశారు.

అయితే గత వారం అర్ధరాత్రి మంచం కింద నుంచి ఏదో వింత శబ్దం రావడం గమనించారు. కానీ ఏవేవో శబ్దాలు రావడం మామూలే అనుకున్నారు. కానీ కాసేపు అయ్యాక ఆ శబ్దాలు మరింత ఎక్కువగా అయ్యాయి. ఏదో వింత శబ్దం వస్తుందని లైట్‌ వేసి చూశారు. ఇంతలో మంచం కింద నుంచి ఓ భారీ కాయం ఉన్న మొసలి బయటకు వచ్చింది. అంతేకాదు మొసలి నెమ్మదిగా వచ్చి బాల్కనీలోని మంచినీటి కొలనులో దిగింది. దీంతో ఆ ఇంగ్లండ్‌ జంట షాకై భయంతో అలానే చూస్తుండిపోయారు. కొంత సేపు వారి గుండె ఆగిపోయేంత పనైపోయింది. భయంతో బయట నుంచి లాక్‌ చేసి ఒంటిపై నూలుపోగు లేకుండా పరుగెత్తి హోటల్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సిబ్బంది వచ్చి మొసలిని బంధించారు. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనలు మాములేనని హోటల్‌ సిబ్బంది చెప్పడం గమనార్హం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.