సన్నగా, పొడవుగా ఉంటే పిల్లలు పుట్టరా?

By సుభాష్  Published on  12 March 2020 6:49 PM IST
సన్నగా, పొడవుగా ఉంటే పిల్లలు పుట్టరా?

స్లిమ్ గా ఉంటే ట్రిమ్ గా ఉంటారు. ట్రిమ్ గా ఉన్న అమ్మాయిలంటే అందరూ పడిచస్తారు. కానీ సన్నగా పొడుగ్గా ఉండే యువతులు తల్లులు కావడం అంత తేలికేం కాదు. వారిలో ఎండో మెట్రియాసిస్ అనే అండాశయ పరమైన ఆరోగ్య సమస్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అండాశయంలో చిన్న చిన్న కణితులు ఏర్పడతాయి. వీటి వల్ల గర్భాధారణపరమైన సమస్యలుంటాయి. ఎలాగో ఒకలాగ గర్భవతులైనా పిండం ఎక్కువ కాలం బతకదు. ఈ విషయాలన్నీ ఇటీవలే ఆన్నల్స్ ఆఫ్ హ్యూమన్ బయాలజీ అనే రీసెర్చ్ మ్యాగజైన్ లో ఈ విషయంలో పరిశోధనాత్మక వ్యాసం ప్రచురితమైంది.

ఎండో మెట్రియాసిస్ ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి వస్తుంది. అయితే సన్నగా, పొడవుగా ఉండే అమ్మాయిల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశోధకుల బృందం ఎనిమిది నుంచి 13 ఏళ్ల వయసున్న 1.70 లక్షల మంది మహిళలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చింది.

పిల్లలుగా ఉన్న సమయంలో బాడీ మాస్ ఇండెక్స్, శరీర నిర్మాణం కూడా గర్భాధారణ, కాన్పులను ప్రభావితం చేస్తుంది. బాగా పొడవు ఉండి, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న యువతుల్లో గర్భాధారణ పరమైన సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వారిలో అనేకానేక ఆరోగయపరమైన సమస్యలు వస్తాయని వారంటున్నారు.

Next Story