బ్రేకింగ్‌: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు, ఎస్సై మృతి

By సుభాష్  Published on  9 May 2020 3:18 AM GMT
బ్రేకింగ్‌: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు, ఎస్సై మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు- మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం కాగా, మదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్కే శర్మ మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఏకే-47, పేలుడు పదార్థాలు, ఇతర తుపాకులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజ్‌నందగాన్‌ ఏఎస్పీ జీఎన్‌ బాఘెల్‌ తెలిపారు. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్దోని గ్రామ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఘటన స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకుని మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహించారు.

కాగా, ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డగా మారినే నేపథ్యంలో తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి. దీంతో ప్రత్యేక బలగాలు కూడా మావోల కోసం తరచూ కూంబింగ్‌ నిర్వహిస్తూనే ఉన్నారు. భారీ మొత్తంలో మావోయిస్టులు ఈ ప్రాంతంలో వచ్చారన్న సమాచారం అందుకుని పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలను చూసిన మావోలు ఎదురు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురు కాల్పులకు దిగారు. కొంత సేపు హోరాహోరీ కాల్సులు చోటు చేసుకున్నాయి. దీంతో నలుగురు మావోలను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

900

Next Story
Share it