విమానం కిటికీ తెరిచి చిక్కుల్లో పడింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 11:16 AM GMT
విమానం కిటికీ తెరిచి చిక్కుల్లో పడింది

బీజింగ్: తెలిసీ తెలియక చేసే పనులు ఒక్కోసారి మన కొంపలు ముంచుతుంటాయి. ఇలాంటి సంఘటనే బీజింగ్ లోని ఒక విమానంలో జరిగింది. చైనాలోని గాన్స్ నుంచి హూబే ప్రావిన్స్ కి వెళ్లాల్సిన వుహాన్కూ.. షియామెన్ ఏయిర్ జెట్ బయలుదేరడానికి సిద్దం అవుతుండగా మహిళ ఎమర్జెన్సీ ఎక్సిట్ కిటికీని తెరిచింది, దీనితో విమానం స్టార్ట్ కాలేదు.

కిటికీ తెరిచి ఉండడం గమనించిన సిబ్బంది వెంటనే ఆమె వద్దకు వెళ్లి అడగ్గా ఉక్కపోతగా ఉందని, గాలికోసం కిటికీని తెరిచానని చెప్పింది. ఈ సమాధానంతో అక్కడున్న అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటనపై వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు సమాచారమివ్వగా విమానంలో తనిఖీలు చేశారు. దీంతో గంట ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఇక ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.Next Story
Share it