అత్యవసర పాస్‌లు ఇక ఇంటికే..
By తోట వంశీ కుమార్ Published on 11 April 2020 6:23 AM GMTకరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే.. తప్ప బయటికి రావడం లేదు. అత్యవసరంటే ఉరు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిందే. ఈ పాస్‌ల కోసం పోలీస్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో రాచకొండ పోలీసులు కొత్త విధానానికి తెరలేపారు.
అత్యవసరంగా ఊరు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకుంటే చాలు. 8 నుంచి 16 గంట్లోగా ప్రయాణ పాస్‌లు వారింటికే జారీ చేస్తామని రాచకొండ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రోడ్ల పై కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. దీంతో ఊరు వెళ్లాలనుకునే వారు.. పాస్‌ల కోసం పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. దీనిని నివారించడానికి ఆన్‌లైన్ విధానం అమలు చేయాలన్న సీపీ మహేష్‌భగవత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాచకొండ పోలీసులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
ఇందుకు రాచకొండ ఐటీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి కృషి చేశారు. ప్రత్యేక వెబ్‌సైట్‌లో ‘రిక్వెస్ట్ ఫర్ పాస్’ ఆప్షన్‌ను క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలును అప్‌లోడ్ చేయాలి. సిబ్బంది పరిశీలించి అర్హులైన వారికి ఓ లింక్‌ను దరఖాస్తు చేసుకున్న వారి మెయిల్‌కి పంపిస్తారు. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే పాస్ కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. ఈ విధానం వ్యక్తిగతంగాను, వాహనాలకు రెండు విధాలు గా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాస్‌లు దుర్వినియోగం కాకుండా పక్కగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారు మాత్రమే ఈ అవకాశం వినియోగించుకోవాలి అని శ్రీధర్‌రెడ్డి తెలిపారు.