యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

UGC NET 2021 admit card released.యూజీసీ నెట్(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 7:26 AM GMT
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

యూజీసీ నెట్(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్) డిసెంబ‌ర్ 2020, జూన్ 2021 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్లు విడుద‌ల అయ్యాయి. యూజీసీ నెట్ డిసెంబర్ 2020 పరీక్షలు న‌వంబ‌ర్‌ 20, 21, 22, 24, 25, 26,29, 30 తేదీల్లో జ‌ర‌గ‌నుండ‌గా.. యూజీసీ నెట్ జూన్ 2021 పరీక్షలను డిసెంబర్ 1, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్ష‌ల కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic లో అడ్మిట్ కార్డ్‌కు పొంద‌వ‌చ్చున‌ని బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అడ్మిట్‌ కార్డ్ ల‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

1. అభ్య‌ర్థులు ugcnetnta.nic.inను ఓపెన్ చేయాలి

2.హోమ్ పేజీ కింది బాగంలో డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డు ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి

3. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది

4. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, భద్రతా కోడ్‌ను ఎంట‌ర్ చేసి క్లిక్ చేయాలి

5. డౌన్‌లోడ్ అయిన వెంట‌నే ప‌రీక్షా కేంద్రం, స‌మ‌యాన్ని చూసుకోవాలి.

అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయలేకపోతే వారు ఉదయం 09:30 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య ఎన్‌టీఏ(నెట్‌) హెల్ప్ లైన్‌ని సంప్రదించవచ్చు. దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్న అభ్యర్థులకు, అర్హత ప్రమాణాలను పూర్తి చేయని అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్‌లను జారీ చేయదు. ఫోటో గుర్తింపుపై ఉన్న పేరు యూజీసీ నెట్‌ అడ్మిట్ కార్డ్ 2021లో చూపిన పేరుతో సరిపోలాలని అభ్యర్థులు గమనించాలి.

Next Story