విద్యార్థులు బీ అల‌ర్ట్.. దేశ వ్యాప్తంగా 24 నకిలీ యూనివర్సిటీలు.. జాబితా ఇదే

UGC Declares 24 Universities As Fake.న‌కిలీ యూనివ‌ర్సీటీలు విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 7:50 AM GMT
విద్యార్థులు బీ అల‌ర్ట్.. దేశ వ్యాప్తంగా 24 నకిలీ యూనివర్సిటీలు.. జాబితా ఇదే

న‌కిలీ యూనివ‌ర్సీటీలు విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నాయి. ఈ విశ్వ‌విద్యాల‌యాల‌కు ప్ర‌భుత్వ అనుమ‌తి లేదు. దీంతో ఇవి ఇచ్చే డిగ్రీలు.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ప‌నిరావు. దీంతో విద్యార్థులు చాలా న‌ష్ట‌పోతున్నారు. కొంద‌రు ఏ మాత్రం ప్ర‌తిభ లేకున్నా కూడా అంద‌ల‌మెక్కుతున్నారు.అందువల్ల విద్యార్థులు వీటికి దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజానీకం, మీడియా సంస్థల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా.. దేశ వ్యాప్తంగా యూనియ‌న్ గ్రాంట్ క‌మిష‌న్(యూజీసీ) 24 ఫేక్(న‌కిలీ) యూనివ‌ర్సిటీలను కేంద్రం గుర్తించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఫేక్ యూనివర్సిటీ జాబితాను యూజీసీ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 24 నకిలీ యూనివర్సిటీలున్నాయి. మరో రెండు సంస్థలు.. భారతీయ శిక్షా పరిషత్‌ (లక్నో), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐపీఎం, న్యూఢిల్లీ) నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని యూజీసీ పేర్కొంది. వీటికి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. వీటిలో అత్య‌ధికంగా ఉత్త‌ప్ర‌దేశ్లోనే ఉన్నాయ‌న్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8, ఢిల్లీలో 7, ఒడిశాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి‌లో ఒక్కో నకిలీ యూనివర్సిటీలను గుర్తించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని నకిలీ యూనివర్సిటీలు

- వారణాసేయ సంస్కృత విశ్వవిద్యాలయ, వారణాసి

- మహిళా గ్రామ్‌ విద్యాపీఠ్‌, అలహాబాద్‌

- గాంధీ హిందీ విద్యాపీఠ్‌, అలహాబాద్‌

- నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలకో్ట్ర కాంప్లెక్స్‌ హోమియోపతి, కాన్పూర్‌

- నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, అలీగఢ్‌

- ఉత్తర ప్రదేశ్‌ విశ్వవిద్యాలయ, మధుర

- మహారాణా ప్రతాప్‌ శిక్షా నికేతన్‌ విశ్వవిద్యాలయ, ప్రతా్‌పగఢ్‌

- ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్‌, నోయిడా

ఢిల్లీలోని నకిలీ యూనివర్సిటీలు

- కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌

- యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ

- ఒకేషనల్‌ యూనివర్సిటీ

- ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యురిడికల్‌ యూనివర్సిటీ

- ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

- విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌

- ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (స్పిరిచ్యువల్‌ యూనివర్సిటీ)

ఇతర రాష్ట్రాల్లోని నకిలీ యూనివర్సిటీలు

- ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అల్టర్నేటివ్‌ మెడిసిన్‌, కోల్‌కతా

- ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రిసెర్చ్‌, కోల్‌కతా

- నవభారత్‌ శిక్షా పరిషత్‌, రూర్కెలా

- నార్త్‌ ఒరిస్సా యూనివర్సిటీ ఆప్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ, ఒడిషా

- శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, పుదుచ్చేరి

- క్రిస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్‌

- రాజా అరబిక్‌ యూనివర్సిటీ, నాగపూర్‌

- సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ, కేరళ

- బదగాన్వి సర్కార్‌ వరల్డ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీ, కర్ణాటక

Next Story