గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

TSWRJC CET 2021 Notification. గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2021 7:19 AM GMT
TSWRJC CET 2021 Notification

ప‌దో త‌ర‌గ‌తి త‌రువాత ఏం చేయాలంటే.. వంద‌కి 90 శాతం మంది ఇంట‌ర్ అనే స‌మాధానం చెబుతారు. మ‌రీ ప్రైవేట్ కాలేజ్‌లో పిల్ల‌ల‌ను చేర్చాలంటే.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఫీజ‌లు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్ర‌భుత్వ కాలేజీల్లోనే నాణ్య‌మైన విద్యాను అందిస్తోంది తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ‌

2021-22 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీన్ని టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2021 అంటారు. ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ‌ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. పరీక్షతేది : ఏప్రిల్ 04, 2021.

ఈ ప‌రీక్ష రాసేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2020-21) ఎస్సెస్సీ లేదా సీబీఎస్సీ లేదా ఐసీఎస్‌ఈ ద్వారా పదో తరగతి పరీక్షలకు హాజర్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రుల ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షల లోపు ఉండాలి. విద్యార్థులు 17 ఏండ్లలోపు ఉండాలి. ఫిబ్రవరి 10 నుంచి 28 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవ‌చ్చు. అప్లికేష‌న్ ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.tswreis.in (OR) www.tsswreisjc.cgg.gov.in అనే వెబ్ సైట్ ను చూడవచ్చు




Next Story