సాంఘిక సంక్షేమ ఇంటర్ కాలేజీల ప్రవేశ పరీక్ష రద్దు
TS RJC cet 2021 is cancelled.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ ఇంటర్ కళాశాలల ప్రవేశ పరీక్ష
By తోట వంశీ కుమార్ Published on
2 Jun 2021 8:48 AM GMT

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ ఇంటర్ కళాశాలల ప్రవేశ పరీక్ష(టీఎస్ ఆర్‌జేసీ సెట్) రద్దైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీఎస్ ఆర్‌జేసీ సెట్‌ను రద్దు చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్‌లో ప్రవేశాలు చేపడుతామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 7వ తేదీ లోపు మార్కులు అప్‌లోడ్ చేయాలని సూచించారు. www.tswreis.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునని సూచించారు.
Next Story