పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

TS Polytechnic counselling schedule released.ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 10:31 AM GMT
పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశం కోసం నిర్వ‌హించే పాలిసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు రేపు విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగ‌స్టు 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగ‌స్టు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవ‌కాశం ఇచ్చారు. ఆగ‌స్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఆగ‌స్టు 23న తుది విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్ ఉంటుంది. అదే రోజు( ఆగ‌స్టు 23) ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్ అవ‌కాశం క‌ల్పించారు. 24న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఆగస్టు 24, 25న వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. 27న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక‌ సెప్టెంబర్‌ 1 నుంచి పాలిటెక్నిక్‌ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 9న స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించింది.

Next Story