వాయిదా ప‌డిన‌ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, ఈసెట్ ప‌రీక్ష తేదీలు ఖ‌రారు

TS EAMCET TS EAMCET Agriculture.తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ఈ నెల 13,14,15 తేదీల్లో జ‌ర‌గాల్సిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2022 2:53 PM IST
వాయిదా ప‌డిన‌ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, ఈసెట్ ప‌రీక్ష తేదీలు ఖ‌రారు

తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ఈ నెల 13,14,15 తేదీల్లో జ‌ర‌గాల్సిన ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఈ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వాయిదా ప‌డిన ఈ ప‌రీక్ష‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నే విష‌యాన్ని తాజాగా ఉన్నత విద్యామండలి ప్ర‌క‌టించింది. ఈ నెల 30,31 తేదీల్లో ఎంసెంట్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఆగ‌స్ట్ 1న ఈ సెట్‌, ఆగ‌స్టు 2 నుంచి 5 వ‌ర‌కు టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నట్లు తెలిపారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్ల నుంచి హాల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చున‌ని విద్యామండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి సూచించారు.

Next Story