CAT- 2025 అప్లైకి రేపే ఆఖరు
మేనేజ్‌మెంట్ స్కూల్‌లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) -2025 రిజిస్ట్రేషన్‌కు రేపే (సెప్టెంబర్ 13) ఆఖరు తేదీ.
By - అంజి |
మేనేజ్‌మెంట్ స్కూల్‌లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) -2025 రిజిస్ట్రేషన్‌కు రేపే (సెప్టెంబర్ 13) ఆఖరు తేదీ. ఆసక్తిగల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను నవంబర్ 5వ తేదీన విడుదల చేస్తారు. క్యాట్ 2025 ప్రవేశ పరీక్ష నవంబర్ 30వ తేదీన, ఫలితాలు జనవరి మొదటి వారంలో విడుదల చేస్తారు.
దరఖాస్తు ఫీజు రూ.2600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. క్యాట్ స్కోర్ ఆధారంగా ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఎంబీఏ, పీజీపీ, పీహెచ్‌డీ, డాక్టరోల్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లలో ప్రవేశం పొందవచ్చు. ఈ స్కోరు ఆధారంగా నాన్ ఐఐఎంలు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
కొన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. క్యాట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్‌లో ఉంటాయి. మొదటి సెక్షన్‌లో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షణ్, రెండో సెక్షన్‌లో డేటా ఇంట్రప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, మూడో సెక్షన్‌లో క్యాంటిటేటివ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పూర్తి వివరాలకు https://iimcat.ac.in/ను విజిట్ చేయండి.