TG EAPCET అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు నేడే ఆఖరు!
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరి చేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది.
By - అంజి |
TG EAPCET అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు నేడే ఆఖరు!
హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరి చేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది. చాలా మంది అప్లికేషన్లలో తప్పులు రావడంతో అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పేరు, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ వంటివి ఆన్‌లైన్‌లో మారవు. మిగతా వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు.
తెలంగాణ EAPCET 2026 దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. అప్లికేషన్ ఫారమ్‌లో మార్పులు లేదా చేర్పులు చేసుకునేందుకు 'కరెక్షన్ విండో'ను ప్రారంభించింది. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ సవరణ ప్రక్రియ ఏప్రిల్ 8, 2026 (బుధవారం) తో ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in సందర్శించి తమ వివరాలను సరిచేసుకోవచ్చు.
సవరణ చేసుకునే విధానం:
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
మార్పులు చేయదగిన అంశాలు:
దరఖాస్తుదారులు తమ తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్ (లింగం), ఆధార్ నంబర్, పదో తరగతి వివరాలు, పాఠశాల పేరు వంటి ప్రధాన వివరాలలో మార్పులు చేసుకోవచ్చు. సవరణలు పూర్తి చేసిన తర్వాత ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్షల షెడ్యూల్:
ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. ఇంజనీరింగ్ విభాగం వారికి మే 4 మరియు మే 5వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాల వారికి మే 9, 10 మరియు 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు కనీసం 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని మండలి సూచించింది.