పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం.. అకడమిక్ నష్టాన్ని భర్తీ చేయడానికి బ్రిడ్జ్ కోర్సు

Textbook distribution delay TS students try bridge course to make up for academic.loss.తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2022 4:45 AM GMT
పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం.. అకడమిక్ నష్టాన్ని భర్తీ చేయడానికి బ్రిడ్జ్ కోర్సు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జూన్ 1న పునఃప్రారంభయ్యాయి. పాఠ‌శాల‌లు ప్రారంభ‌మై నెల‌రోజులు గ‌డుస్తున్నా కూడా ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయిలో విద్యార్థుల‌కు పాఠ్య పుస్త‌కాల‌ను పంపిణీ చేయ‌లేదు. ప్ర‌స్తుతం పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు బ్రిడ్జ్ కోర్సులు న‌డుస్తున్నాయి.

దీనిపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మల్లారెడ్డి మాట్లాడుతూ.. "పాఠ్యపుస్తకాలు లేకుంటే విద్యార్థులు తరగతులకు రావ‌డం లేదు. ప్రస్తుతం రివిజన్ తరగతులు కొనసాగుతున్నాయి. మరికొంత మంది విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. మళ్లీ అదే పాఠాలు నేర్చుకుని విసుగు చెందుతున్నారు. కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు. మరి దీని కోసం పాఠ్యపుస్తకాలు కావాలి' అని అన్నారు. వీలైనంత త్వరగా పుస్తకాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.

మల్లారెడ్డి పనిచేస్తున్న మహబూబాబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందాయి. మిగతా తరగతులన్నీ తమ బ్రిడ్జి కోర్సులను కొనసాగిస్తున్నాయి. సాధారణంగా బ్రిడ్జి కోర్సు 15-20 రోజులు ఉంటుంది. అయితే ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం కారణంగా ప్రభుత్వం బ్రిడ్జి కోర్సును దాదాపు 40 రోజులకు పొడిగించిందని ఆయన చెప్పారు.

'ఇంతలో రివిజన్ చేద్దామా?'

సికింద్రాబాద్‌లోని మజీడియాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (జిజిహెచ్‌ఎస్) ఉపాధ్యాయురాలు ఆర్ శారద మాట్లాడుతూ.. తమ పాఠశాలలో 50శాతం మంది విద్యార్థులు జూలై 6న పాఠ్యపుస్తకాలు పొందారని చెప్పారు. "మేము ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పంపిన బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్, వర్క్‌షీట్‌లను అనుసరిస్తున్నాము. ఇది ప్రధానంగా విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి. 1 నుండి 10 వరకు అన్ని తరగతులకు బ్రిడ్జ్ కోర్సు జరిగింది" అని ఆమె చెప్పారు.

అయితే.. ఇది కేవలం పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం వల్ల మాత్రమే కాదని, కోవిడ్ -19 మరియు విద్యార్థుల చదువులో ఉన్న గ్యాప్‌ను పరిగణనలోకి తీసుకొని బ్రిడ్జ్ కోర్సు అవసరమని ఆమె అన్నారు. వారి యోగ్యత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అవసరమని చెప్పారు.

సాధారణంగా.. కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు విద్యార్థులను అంచనా వేయడానికి పాఠశాలలు బేస్‌లైన్ పరీక్షను నిర్వహిస్తాయి. ఈ పరీక్ష ఆధారంగా విద్యార్థులను వర్గీకరించి ఒక్కొక్కరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ఏడాది పరీక్షకు బదులు బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తున్నామని శారద తెలిపారు. జూలై మూడో వారంలో జరగనున్న మొదటి నిర్మాణాత్మక అంచనాకు బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్‌లు ప్రాతిపదికగా ఉంటాయని కూడా ఆమె తెలిపారు.

పాఠ్యపుస్తకాలు ఎప్పుడు వస్తాయి?

ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యానికి ప్రభుత్వం రెండు కార‌ణాల‌ను చెబుతోంది. అందులో ఒక‌టి పెరుగుతున్న పేపర్ ధర కాగా.. రెండోది ద్విభాషా ముద్ర‌ణ‌. పాఠ్యపుస్తకాల ముద్రణ, పంపిణీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ''సాధారణంగా మెట్రిక్ టన్ను పేపర్ ధర రూ.61వేలు ఉండగా ఈ ఏడాది మెట్రిక్ టన్ను రూ.97వేలకు పెరిగింది. తక్కువ ధరకే టెండర్ కోసం ఎదురుచూడడంతో జాప్యం, చివరకు ప్రభుత్వం రూ.95వేలకు అంగీకరించింది. ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు ద్విభాషా (ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీషు) ఉండడమే కారణం' అని చెప్పారు. అలాగే 70 శాతం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామని, మిగిలిన 30 శాతం పాఠ్యపుస్తకాలను 10 రోజుల్లో సంబంధిత పాఠశాలలకు పంపుతామని చారి తెలిపారు.

Next Story