Telangana: టెన్త్‌ ఫైనల్ ఎగ్జామ్స్‌ ఫీజు షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  2 Nov 2023 8:00 PM IST
telangana, tenth, students alert, fee schedule,

 Telangana: టెన్త్‌ ఫైనల్ ఎగ్జామ్స్‌ ఫీజు షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల అయ్యింది. 2024 ఏడాది మార్చిలో టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూళ్లలో టెన్త్‌ చదువుతున్న విద్యార్థుల నుంచి వార్షిక పరీక్షల ఫీజు వసూళ్లపై షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

నవంబర్‌ 17వ తేదీ లోపు విద్యార్థులు టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో అయితే డిసెంబర్‌ 1 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. పదో తరగతి రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిల్‌ అయిన వారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్‌ అయినవారు రూ.125, వొకేషనల్‌ విద్యార్థులు రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

Next Story