తెలంగాణ పాలిసెట్ 2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకోండి

Telangana Polycet results 2022 Released.తెలంగాణ పాలిసెట్ 2022 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఫ‌లితాల‌ను సాంకేతిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 July 2022 5:50 AM GMT
తెలంగాణ పాలిసెట్ 2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ పాలిసెట్ 2022 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఫ‌లితాల‌ను సాంకేతిక విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నవీన్‌ మిట్టల్‌ విడుద‌ల చేశారు. పదవ తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌ (పాలిసెట్‌–2022)ను నిర్వ‌హిస్తారు. ఇందులో వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హారి్టకల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. జూన్ 30న 365 కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌గా 1,04,432 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో 75.73శాతం విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఉత్తీర్ణ‌త సాధించిన వారిలో బాలిక‌లు 79.99శాతం కాగా, బాలురు 72.12 శాతంగా ఉన్నారు. https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

పాలిటెక్నిక్ కోర్సులు ఇవే..

సివిల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ అస్టిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ (సాండ్‌విచ్), ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(షుగర్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(పెట్రోకెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్(ప్లాస్టిక్స్ అండ్ పాలి మర్స్), సిరామిక్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో 3ఏళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీప్‌లో ర్యాంక్ ద్వారా వీటిల్లో చేరొచ్చు.

Next Story