ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇంటర్ ప్రథమ, ద్వితీయ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 27 April 2024 3:00 PMఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 24వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు.
ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 10న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత రోజే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను అధికారులు నిర్వహిస్తారు.
ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
మే 24వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
మే 25వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -1
మే 28వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
మే 29వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మే 30వ తేదీన ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్ -1
మే 31వ తేదీన కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
జూన్ 1వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1
జూన్ 3వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1
సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
మే 24వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మే 25వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -2
మే 28వ తేదీన మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటని పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
మే 29వ తేదీన మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
మే 30వ తేదీన ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్ -2
మే 31వ తేదీన కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
జూన్ 1వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
జూన్ 3వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2