Telangana: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఇంటర్ బోర్డు ఆదివారం ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసింది.

By -  అంజి
Published on : 12 April 2026 12:30 PM IST

Telangana Inter Results 2026, TS Intermediate Results, Inter Pass Percentage, TS Inter Supplementary Schedule, Re-counting and Re-verification, Intermediate Board Telangana, Education News Telangana

Telangana: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఇంటర్ బోర్డు ఆదివారం ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంయుక్తంగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 66.2 శాతం మంది, ద్వితీయ సంవత్సరంలో 70.58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడటం విశేషం.

ప్రథమ సంవత్సరం: మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,23,807 మంది పాసయ్యారు. ఇందులో బాలికలు 74.4 శాతంతో ముందంజలో ఉండగా, బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ద్వితీయ సంవత్సరం: 5,07,948 మంది విద్యార్థులకు గాను 3,58,490 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా బాలికలు 78.65 శాతంతో సత్తా చాటగా, బాలురు 62.50 శాతానికి పరిమితమయ్యారు.

రీ-వెరిఫికేషన్, సప్లిమెంటరీ వివరాలు:

ఫలితాల విడుదలతో పాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ప్రకటించింది. మార్కులతో సంతృప్తి చెందని వారు రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫీజును కూడా ఏప్రిల్ 13 నుంచి 20 లోపు చెల్లించాల్సి ఉంటుంది. మే 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.

Next Story