గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

Telangana BC Welfare Residential Degree College entrance results out. తెలంగాణలోని బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం

By అంజి  Published on  28 July 2022 4:15 PM GMT
గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణలోని బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు సాధించిన మార్కులను http://www.mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు . మొదటి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని, మెరిట్ జాబితా ఆధారంగా కళాశాలలో ప్రవేశం పొందాలని ఆయన తెలిపారు.

తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు.

Next Story