కార్మికుల పిల్లలకు రూ.25 వేల వరకు స్కాలర్‌షిప్
కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువులకు ఆర్థికంగా చేయూతనందిస్తోంది.
By అంజి
కార్మికుల పిల్లలకు రూ.25 వేల వరకు స్కాలర్‌షిప్
కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువులకు ఆర్థికంగా చేయూతనందిస్తోంది. చదువులు బట్టి రూ.1000 నుంచి రూ.25,000 వరకు ఏటా స్కాలర్‌షిప్ అందిస్తోంది. దీని కోసం విద్యార్థులు https://scholarships.gov.in/ అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రైమరీ స్థాయి నుంచి ఉన్నతస్థాయి చదువులు చదువుతున్న వారికి ఉపకారవేతనం అందజేయనున్నారు. ఇంటర్‌కు రూ.3 వేలు, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు రూ.6 వేలు, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాదికి రూ.25 వేల చొప్పున ఇవ్వనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఎంతమందికైనా ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. విద్యార్థి ఫొటో, కార్మికుల గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్, విద్యార్థి ఉత్తీర్ణత సర్టిఫికెట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ (1 నుంచి 10 వతరగతి వరకు)కు ఆగస్టు 31 వరకు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://scholarships.gov.in/ ను విజిట్ చేయండి.