మే 17న టీఎస్ పాలిసెట్.. దరఖాస్తులకు ఆహ్వానం

Polycet 2023 On May 17 Online Registration Begins. హైదరాబాద్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET)

By అంజి  Published on  11 Jan 2023 10:00 AM GMT
మే 17న టీఎస్ పాలిసెట్.. దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) 2023-24 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET)ని మే 17న నిర్వహించనుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ సంస్థలలో అందించే ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ నిర్వహించబడుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు PJTSAU, PVNRTVU, SKLTSHU అందించే వెటర్నరి, హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో కోర్సుల్లో ప్రవేశం పొందుతారు.

ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా అంతకు ముందు లేదా 2023లో దానికి హాజరయ్యే అభ్యర్థుల నుండి దరఖాస్తులను బోర్డు ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 16 నుండి ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష కోసం నమోదు చేసుకోవచ్చు. రూ. 100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. అయితే, పరీక్ష పూర్తయిన 10 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించబడతాయి. మరిన్ని వివరాల కోసం టీఎస్‌ పాలీసెట్‌ వెబ్‌సైట్‌ www.polycet.sbtet.telangana.gov.inను చూడండి.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 040-23222192లో కాల్‌ చేయవచ్చు. లేదా polycette@telangana.gov.inకు ఇమెయిల్ చేయవచ్చు.

Next Story