ఒక దేశం – ఒక విద్యార్థి ఐడీ.. ప్రయోజనాలు ఇవే

ఈ ప్రత్యేక విద్యార్థి గుర్తింపు నంబర్ ద్వారా దేశంలోని ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రయాణాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.

By -  అంజి
Published on : 4 Nov 2025 6:46 AM IST

One Nation -One Student id, educational journey, APAAR ID

ఒక దేశం – ఒక విద్యార్థి ఐడీ.. ప్రయోజనాలు ఇవే

జాతీయ విద్యా విధానం (NEP) 2020 దృష్టిలో భాగంగా APAAR ID (Automated Permanent Academic Account Registry) ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రత్యేక విద్యార్థి గుర్తింపు నంబర్ ద్వారా దేశంలోని ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రయాణాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.

అపార్‌ ఐడీ ప్రయోజనాలు:

- విద్యార్థి యొక్క విద్యా విజయాలు, సర్టిఫికెట్లు, స్కిల్ అచీవ్‌మెంట్‌లు అన్నీ ఒకే చోట నమోదవుతాయి.

- విద్యార్థులు తమకు అనుకూలమైన లెర్నింగ్ పాథ్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

- విద్యా వ్యవస్థలో అకాడెమిక్ ఫ్లెక్సిబిలిటీ మరియు మొబిలిటీ పెరుగుతుంది - అంటే విద్యార్థులు స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ మారినా, వారి డేటా సులభంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

మీరు విద్యార్థినా?

అయితే, వెంటనే APAAR ప్లాట్‌ఫారమ్‌లో మీ ప్రత్యేక ఐడీని సృష్టించుకోండి. ఈ కొత్త డిజిటల్ విద్యా విప్లవంలో భాగస్వామి అవ్వండి.

‘ఒక దేశం - ఒక విద్యార్థి ఐడీ’ - భారత విద్యార్థుల కోసం ఒక సమగ్ర డిజిటల్ గుర్తింపు వ్యవస్థ. వెంటనే ప్రత్యేక ఐడీని సృష్టించుకునేందుకు ncert.nic.in లేదా http://apaar.education.gov.in ను విజిట్‌ చేయండి.

Next Story