నీట్‌-యూజీ అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యోప‌రిమితి తొల‌గింపు

NEET-UG 2022 NMC removes upper age limit for all applicants.నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2022 1:02 PM GMT
నీట్‌-యూజీ అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యోప‌రిమితి తొల‌గింపు

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) ద్వారా అండర్ గ్రాడ్యూయేట్ సీట్లకు పోటీ పడే అభ్యర్థుల గ‌రిష్ట వ‌యోప‌రిమితిని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తొల‌గించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించిన గరిష్ట వయోపరిమితి ఎంబీబీఎస్ సీట్ల‌కు పోటీ ప‌డే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 25 ఏళ్ల లోపు గా ఉండ‌గా.. ఎస్సీ, ఎస్టీల‌కు మ‌రో అయిదేళ్లు అంటే..30 ఏళ్లుగా ఉంది.

21 అక్టోబర్ 2021న జరిగిన 4వ NMC సమావేశంలో NEET-UG పరీక్షలో హాజరయ్యేందుకు ఎటువంటి నిర్ణీత గరిష్ట వయోపరిమితి ఉండకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, 1997పై నిబంధనలను సవరించడానికి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించామని నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. ఎన్‌ఎంసి చైర్‌పర్సన్ డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ వయసు అర్హతల సడలింపు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

"ఈ నిర్ణయం ఔత్సాహిక వైద్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలో వైద్య విద్యను బలోపేతం చేయడంలో మరింత సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.

Next Story