నీట్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NEET Admit Cards 2022 Released. నీట్ యూజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీ 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను
By అంజి
నీట్ యూజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీ 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రిలీజ్ చేసింది. అలాగే సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డ్‌లను కూడా విడుదల చేసింది. విద్యార్థులు నీట్, సీయూఈటీ అడ్మిట్ కార్డ్‌లను neet.nta.nic.in , cuet.samarth.ac.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం లాగిన్ డీటైల్స్గా అప్లికేషన్ నెంబర్, పుట్టిన రోజును తేదీలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నెల 17న నీట్ యూజీ 2022 పరీక్ష జరగనుంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష కోసం ఈ ఏడాది 18,72,341 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ సంవత్సరం సీయూఈటీ రెండు దశల్లో జులై 15 నుంచి జరగనుంది. 14,90,000 మంది సీయూఈటీకి అప్లై చేశారు.నీట్ యూజీ 2022 పరీక్ష.. దేశవ్యాప్తంగా ఉన్న 497 నగరాల్లో జరగనుంది. అదే సమయంలో భారత్ బయట 14 నగరాల్లో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. సీయూఈటీ.. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో, విదేశాల్లోని 10 నగరాల్లో జరగనుంది.
నీట్ పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు 1 మార్కు కోత ఉంటుంది.
అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్టెప్ 1: మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ ను ఓపెన్ చేయాలి
స్టెప్ 2: NEET UG 2022 అడ్మిట్ కార్డ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
స్టెప్ 3: అప్లికేషన్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి
స్టెప్ 4: నీట్-2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది
స్టెప్ 5: అడ్మిట్ కార్డులోని వివరాలను సమీక్షించుకుని.. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.