Andhrapradesh: టెట్‌ ఫలితాలు విడుదల

గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు.

By అంజి  Published on  4 Nov 2024 11:35 AM IST
Minister Nara Lokesh, TET results, DSC

Andhrapradesh: టెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. అభ్యర్థులు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాగా త్వరలోనే 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

''రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ నా శుభాకాంక్షలు'' అని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Next Story