గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2026)కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 28 ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమనిటీస్ వంటి 30 సబ్జెక్టులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. లేట్ ఫీజుతో అక్టోబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7,8,14,15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 19న స్కోరు కార్డు విడుదల చేస్తారు. గేట్ స్కోరుకు మూడేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
ఈ పరీక్షలో మంచి స్కోరు సాధిస్తే ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లో ఎంటెక్/ ఎంఈ/ పీహెచ్‌డీల్లో చేరవచ్చు. తద్వారా పరిశోధనల వైపు అడుగులు వేయవచ్చు. గేట్ స్కోరు ద్వారా కేంద్రం అందించే ఫెలోషిప్‌లు అందుకు సీఎస్‌ఐఆర్ రీసెర్చ్ లేబరేటరీల్లో రీసెర్చ్ కొనసాగించవచ్చు. రీసెర్చ్ అనంతరం దేశ, విదేశాల్లో అద్భుత అవకాశాలు పొందవచ్చు.