జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిజల్ట్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సోమవారం మధ్యాహ్న ఫైనల్ కీ రిలీజ్ చేసిన ఎన్‌టీఏ.. లేటెస్ట్‌గా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేసింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లలో ఉంటుంది. ఈ రెండింటిలో ఒక్క సెషన్‌లో అర్హత సాధించినా అభ్యర్థులు అడ్వాన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. కాగా స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కాగా ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు స్టూడెంట్స్ 100 పర్సంటైల్ సాధించారు. మొత్తం 14మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బనిబ్రత మజీ ఉన్నారు. జేఈఈ (మెయిన్) పేపర్ -2 (బీఆర్క్/బి ప్లానింగ్) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.