జేఈఈ పరీక్షలు మళ్లీ వాయిదా

JEE Mains Exam postponed once again.జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులు చేసేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 9:15 AM GMT
జేఈఈ పరీక్షలు మళ్లీ వాయిదా

జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులు చేసేందుకు దేశంలోని ప్రఖ్యాత సంస్థలు ఐఐటీ, ఎన్ఐటీలో చేరాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ పరీక్షలు రాయాలి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జేఈఈ పరీక్షల కారణంగానే ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు మార్చుకోవల్సి వచ్చింది. ఈసారి ఈ పరీక్షలు జూన్, జూలై నెలల్లో జరగనున్నాయి. తొలి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు జూన్ 20 నుంచి 29వ తేదీ వరకూ జరగనుండగా..రెండవ విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకూ జరగనున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇందుకు సంబంధించిన కొత్త తేదీలను వెల్లడించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఎగ్జామ్స్ ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించాల్సింది. అయితే తాజా షెడ్యూల్‌ ప్రకారం జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలకు ఈ ఎగ్జామ్స్ ను మార్చినట్లు ఎన్‌టీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకే జేఈఈ పరీక్షల తేదీలు మరోసారి మార్చాల్సి వచ్చిందని ఎన్టీఏ తెలిపింది.

Next Story