జేఈఈ మెయిన్స్‌.. ఈ టిప్స్‌ పాటించండి

జేఈఈ మెయిన్స్‌ 2025 సెషన్‌ 1 పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల అయ్యాయి.

By అంజి  Published on  19 Jan 2025 4:43 PM IST
JEE Mains exam, Exam tips, JEE, NTA

జేఈఈ మెయిన్స్‌.. ఈ టిప్స్‌ పాటించండి

జేఈఈ మెయిన్స్‌ 2025 సెషన్‌ 1 పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల అయ్యాయి. పరీక్షకు సమయం దగ్గరపడటంతో విద్యార్థులు ఎన్ని మాక్‌ టెస్ట్‌లు రాస్తే అంత మంచింది. దీని వల్ల టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన వస్తుంది. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. ఎన్డీఏ వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయ. ముందు క్వశ్చన్‌ పేపర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి.

తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధాన ఇవ్వండి. దీంతో మీలో కాన్ఫిడెంట్‌ పెరుగుతుంది. కఠిన ప్రశ్నలను ముందు మొదలు పెట్టకండి. దీనికి సమయం ఎక్కువ పడుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. గెస్‌ మార్కులకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ప్రశ్నకు సమాధానం డౌట్‌గా ఉంటే దాన్ని స్కిప్‌ చేయండి. కచ్చితంగా సమాధానం ఇవ్వాలని అనిపిస్తే ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ చేపట్టండి. ఒక్కో ఆప్షన్‌ని తొలగిస్తూ రండి.

ఇలా చేస్తే కరెక్ట్‌ సమాధానం గుర్తించే అవకాశం ఉంటుంది. పాత జేఈఈ క్వశ్చన్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేస్తే మంచిది. ప్రశ్నల కఠినత్వంపై మీకు అంచనా వస్తుంది. జేఈఈ సిలబస్‌లో అధిక వెయిటేజ్‌ ఉన్న ప్రశ్నలను ఎంచుకోని వాటిని సాల్వ్‌ చేయండి. దీంతో మీ స్కోరు పెరుగుతుంది. ఒత్తిడి, యాంగ్జైటీతో పరీక్‌షలో తప్పులు జరుగుతాయి. దీంతో నెగిటివ్‌ మార్కులు పడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

Next Story