రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు పేపర్‌ -1 పరీక్షను నిర్వహిస్తారు.

By అంజి  Published on  23 Jan 2024 1:56 AM GMT
JEE Exam, JEE Main, JEE Main 2024, JEE Main Exam Date

రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్స్‌ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్స్‌ ఆఫ్‌ ప్లానింగ్‌లో ప్రవేశాలకు బుధవారం పేపర్‌ -2 ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు పేపర్‌ -1 పరీక్షను నిర్వహిస్తారు. 2 పేపర్లకు కలిపి రికార్డు స్థాయిలో 12.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు లక్షన్నర మంది పేపర్ - 2 రాసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. విద్యార్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌చేసి అడ్మిట్‌కార్డులను పొందవచ్చు.

పరీక్షా తేదీలు సమీపించినందున అన్ని చాప్టర్స్‌ను ఈ సమయంలో ముందేసుకోవద్దని, అలాగే కొత్త చాప్టర్ల జోలికెళ్లొద్దని విద్యా నిపుణులు చెబుతున్నారు. గణితంలో 15, ఫిజిక్స్‌లో 20, కెమిస్ట్రీలో 20 ప్రశ్నలు రాసేలా రివిజన్‌ చేయాలంటున్నారు. గణితంలో సెట్‌ రిలేషన్‌, సిరీస్‌, త్రీడీ జామెట్రీ, వెక్టార్స్‌ ఆల్జీబ్రా, కాంప్లెక్స్‌ నంబర్స్‌ వంటి సబ్జెక్టులను రివిజన్‌ చేయడం ఉత్తమం. నిపుణుల అంచనా ప్రకారం 40 శాతం ప్రశ్నలు నేరుగా ఫార్ములా బేస్డ్‌, మరో 40 శాతం పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నుంచి, మిగతా ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఇస్తున్నారు.

Next Story