జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా
JEE advanced exam applications process postponed. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది.
By తోట వంశీ కుమార్ Published on
11 Sep 2021 3:18 AM GMT

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి(శనివారం) ఉదయం 10 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం కావడంతో.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. ఈ నెల 13న మధ్యాహ్నాం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుట్లు వెల్లడించింది. 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. అక్టోబర్ 3న నిర్వహించనున్న పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
Next Story