బ్యాంకుకు వెళ్లకుండానే ఎడ్యుకేషన్‌ లోన్‌.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

స్కూల్‌, ఇంటర్‌మీడియట్‌ వరకు ఎలాగోలా చదువుకోగలిగినా.. ఆపై చదువులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతున్నాయి.

By అంజి  Published on  18 Jun 2024 6:30 AM GMT
education loan , bank, vidyalakshmi Yojana

బ్యాంకుకు వెళ్లకుండానే ఎడ్యుకేషన్‌ లోన్‌.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులు ఊహలకు కూడా అందనిది. స్కూల్‌, ఇంటర్‌మీడియట్‌ వరకు ఎలాగోలా చదువుకోగలిగినా.. ఆపై చదువులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతున్నాయి. అయితే, ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో పీఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్‌ లోన్‌ యోజన పేరుతో ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల వరకు బ్యాంకు లోన్ పొందొచ్చు. అది కూడా బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా విద్యార్థులు బ్యాంకుల నుంచి రూ.7.5 లక్షల వరకు ఎడ్యుకేషన్‌ లోన్‌ పొందొచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే రూ.15 లక్షల వరకు వస్తుంది.

దరఖాస్తు విధానం ఇలా..

విద్యాలక్ష్మి పోర్టల్‌ https://vidyalakshmi.co.in/లో రిజిస్టర్‌ చేసుకున్నాక, అవసరమైన వివరాలను ఎంటర్‌ చేసి, అకౌంట్‌ క్రియేట్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత కామన్‌ ఎడ్యుకేషన్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి, అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి. మీ అవసరాలు, అర్హత, సౌలభ్యం ఆధారంగా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్‌లో CELAF ద్వారా ఒక విద్యార్థి గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫామ్‌ను ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ జారీ చేస్తుంది. ఈ పథకం కింద 13 బ్యాంకులు లిస్ట్‌ అయ్యాయి. ఇవి దాదాపు 22 రకాల విద్యా రుణాలు అందిస్తున్నాయి.

కావాల్సిన పత్రాలు

విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్‌ లోన్‌ పొందడం కోసం ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ లేదా పాన్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌ సైజు ఫొటో, అడ్రస్‌ ప్రూఫ్‌ వంటి డాక్యుమెంట్స్‌తో సబ్మిట్‌ చేయడం తప్పనిసరి. పైన పేర్కొన్న డాక్యుమెంట్స్‌తో పాటు తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, హైస్కూల్‌, ఇంటర్మీడియటన్ మార్క్‌ షీట్‌ల జిరాక్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.

వీటితో పాటు మీరు చదువబోయే సంస్థ అడ్మిషన్‌ కార్డు అందించాలి. అన్ని రకాల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు, కోర్సు వ్యవధి కూడా అందులో పొందుపర్చాలి. లోన్‌కు అప్లై చేసుకున్నాక అన్నీ సరిగ్గా చేశారా? లేదా? అని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి. అప్పుడప్పుడు మీ లోన్‌ స్టేటస్‌ను కూడా ట్రాక్‌ చేస్తూ ఉండాలి.

Next Story