ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇబ్బందులు పడకుండా కోటక్ మహీంద్రా గ్రూప్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. కోటక్ కన్యా స్కాలర్‌షిప్ పేరుతో కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్స్ ఇవ్వనుంది. ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉన్న విద్యార్థులు ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. పూర్తి వివరాల కోసం https://kotakeducation.org/ ను విజిట్ చేయండి.