సీబీఎస్ఈ ఫ‌లితాలు.. మీ హాల్ టికెట్ నెంబ‌ర్ ఇలా తెలుసుకోండి

CBSE class 12 Exams result 2021 today at 2 pm.సీబీఎస్ఈ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 7:38 AM GMT
సీబీఎస్ఈ ఫ‌లితాలు.. మీ హాల్ టికెట్ నెంబ‌ర్ ఇలా తెలుసుకోండి

సీబీఎస్ఈ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ప్ర‌క‌టించింది. జులై 31 నాటికి సీబీఎస్ఈ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌ని బావిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం గ‌త నెల సుప్రీం కోర్టుకు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in పొంద‌వ‌చ్చున‌ని తెలిపింది. దీనితో పాటు digilocker.gov.in ఫ‌లితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబ‌రు ఎంట‌ర్ చేస్తే స‌రిపోతుంది.

కాగా.. క‌రోనా మహమ్మారిని కార‌నంగా హాల్ టికెట్లు విడుదల చేయడానికి ముందు బోర్డు పరీక్షలు రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో విద్యార్థులకు హాల్ టికెట్లు జారీకాలేదు. కాగా.. విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవాలంటే.. హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. అందుకే విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవడం కోసం బోర్డు ఒక సింపుల్ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ లింకును తమ అధికారిక పోర్టల్స్ cbse.nic.in మరియు cbse.gov.inలో యాక్టివేట్ చేయబడింది.

CBSE రోల్ నెంబర్ ఫైండర్‌ను యాక్సెస్ ఎలా చేయాలంటే?

- ముందుగా CBSE యొక్క అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.

- పేజీని కిందికి స్క్రోల్ చేసి 'రోల్ నెంబర్ ఫైండర్' పై క్లిక్ చేయండి.

- ఆ తర్వాత మీరు మరో కొత్త పేజీకి ఎంటర్ అవుతారు. అక్కడ 'కంటిన్యూ'పై క్లిక్ చేయాలి.

- తదుపరి మీరు 10వ తరగతి లేదా 12వ తరగతి ఏది కావాలో ఎంచుకోవాలి.

- అక్కడ మీ పేరు, తండ్రి పేరు, పాఠశాల కోడ్, పుట్టిన తేదీ మరియు తల్లి పేరు ఎంటర్ చేయాలి.

- అనంతరం ప్రొసీడ్ మీద క్లిక్ చేసి క్లాస్ 10 లేదా క్లాస్ 12 రోల్ నంబర్‌ను పొందవచ్చు.

Next Story