సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.. రిజల్ట్ ఇలా చూసుకోండి
CBSE class 12 Exams Result 2021 Out.సీబీఎస్ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలను
By తోట వంశీ కుమార్ Published on 30 July 2021 2:21 PM ISTసీబీఎస్ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in పొందవచ్చునని తెలిపింది. దీనితో పాటు digilocker.gov.in ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్‌నంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది.
కాగా.. కరోనా మహమ్మారిని కారనంగా హాల్ టికెట్లు విడుదల చేయడానికి ముందు బోర్డు పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో విద్యార్థులకు హాల్ టికెట్లు జారీకాలేదు. కాగా.. విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవాలంటే.. హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. అందుకే విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవడం కోసం బోర్డు ఒక సింపుల్ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ లింకును తమ అధికారిక పోర్టల్స్ cbse.nic.in మరియు cbse.gov.inలో యాక్టివేట్ చేయబడింది.
CBSE రోల్ నెంబర్ ఫైండర్‌ను యాక్సెస్ ఎలా చేయాలంటే?
- ముందుగా CBSE యొక్క అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- పేజీని కిందికి స్క్రోల్ చేసి 'రోల్ నెంబర్ ఫైండర్' పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీరు మరో కొత్త పేజీకి ఎంటర్ అవుతారు. అక్కడ 'కంటిన్యూ'పై క్లిక్ చేయాలి.
- తదుపరి మీరు 10వ తరగతి లేదా 12వ తరగతి ఏది కావాలో ఎంచుకోవాలి.
- అక్కడ మీ పేరు, తండ్రి పేరు, పాఠశాల కోడ్, పుట్టిన తేదీ మరియు తల్లి పేరు ఎంటర్ చేయాలి.
- అనంతరం ప్రొసీడ్ మీద క్లిక్ చేసి క్లాస్ 10 లేదా క్లాస్ 12 రోల్ నంబర్‌ను పొందవచ్చు.