సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. సీబీఎస్‌ఈ పదో తరగతి మొదటి పరీక్ష ఫిబ్రవరి 15న ఇంగ్లీష్ కమ్యూనికేటివ్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫిబ్రవరి 20న సైన్స్, ఫిబ్రవరి 22న ఫ్రెంచ్/ సంస్కృతం, ఫిబ్రవరి 25న సోషియాలజీ, ఫిబ్రవరి 28న హిందీ కోర్సు A/B, మార్చి 10న మ్యాథ్స్, మార్చి 18న కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ పరీక్ష నిర్వహిస్తారు.
12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15న ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 21న ఫిజిక్స్, ఫిబ్రవరి 22న బిజినెస్ స్టడీస్, ఫిబ్రవరి 24న భౌగోళిక శాస్త్రం, ఫిబ్రవరి 27న కెమిస్ట్రీ, మార్చి 8న మ్యాథ్స్ - స్టాండర్డ్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్, మార్చి 18న ఇంగ్లిష్ ఎలక్టివ్/ ఇంగ్లిష్ కోర్, మార్చి 19న ఎకనామిక్స్, మార్చి 22న పొలిటికల్ సైన్స్, మార్చి 25న బయాలజీ, మార్చి 26న అకౌంటింగ్, ఏప్రిల్ 1న హిస్టరీ, ఏప్రిల్ 4న సైకాలజీ పరీక్ష నిర్వహిస్తారు.