సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల.. రిజల్ట్ ఇలా చూసుకోండి

CBSE class 10 exam Result 2021 Out.కరోనా మహమ్మారి కారణంగా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను ర‌ద్దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 6:55 AM GMT
సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల.. రిజల్ట్ ఇలా చూసుకోండి

కరోనా మహమ్మారి కారణంగా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను ర‌ద్దు చేయ‌గా.. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నేడు సీబీఎస్‌ఈ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. వాస్తవానికి పదో తరగతి ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉండగా, పాఠశాలల నుంచి మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల వాయిదా పడింది.

ఫలితాలు చెక్‌ చేసుకోండిలా..

సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఫలితాలు అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. ఫలితాల కోసం cbseresults.nic.inలో చూసుకోవచ్చు. అలాగే cbse.gov.in, cbse.nic.in తో పాటు డిజిలాక‌ర్ యాప్‌లోనూ తెలుసుకోవ‌చ్చు. ఫ‌లితాలు పొందేందుకు విద్యార్థులు త‌మ రోల్ నంబ‌ర్ తో పాటు స్కూల్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాల్సి ఉంది.

CBSE రోల్ నెంబర్ ఫైండర్‌ను యాక్సెస్ ఎలా చేయాలంటే?

- ముందుగా CBSE యొక్క అధికారిక పోర్టల్ cbseit.in/cbse/2021/rfinder/RollDetails.aspx ఓపెన్ చేయాలి

- తదుపరి మీరు 10వ తరగతి లేదా 12వ తరగతి ఏది కావాలో ఎంచుకోవాలి.

- అక్కడ మీ పేరు, తండ్రి పేరు, పాఠశాల కోడ్, పుట్టిన తేదీ మరియు తల్లి పేరు ఎంటర్ చేయాలి.

- అనంతరం ప్రొసీడ్ మీద క్లిక్ చేసి క్లాస్ 10 లేదా క్లాస్ 12 రోల్ నంబర్‌ను పొందవచ్చు.

Next Story
Share it