CAT-2024.. దరఖాస్తుకు నేడు ఆఖరు
మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)-2024 రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు తేదీ.
By అంజి Published on 13 Sept 2024 6:16 AM ISTCAT-2024.. దరఖాస్తుకు నేడు ఆఖరు
మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)-2024 రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు తేదీ. ఆసక్తిగల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను నవంబర్ 5న విడుదల చేస్తారు. క్యాట్ 2024 ప్రవేశ పరీక్ష నవంబర్ 24వ తేదీన, ఫలితాలు జనవరి రెండో వారంలో విడుదల చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1250 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసే సమయంలో పేరు, ఇతర వివరాలను ఎంటర్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే హాల్ టికెట్లు, పరీక్షల్లో ఇబ్బందులు ఉండవు. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటైఈల్లో ఎంబీఏ, పీజీపీ, పీహెచ్‌డీ, డాక్టోరల్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. క్యాట్ స్కోరు ఆధారంగా నాన్ ఐఐఎంలు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తో పాటు గ్రూప్ డిష్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నాయి.
క్యాట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో వెర్రబల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, రెండో సెక్షన్‌లో డేటా ఇంట్రప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, మూడో సెక్షన్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్యాట్‌లో 95 నుంచి 80 శాతం పర్సంటైల్ సాధించిన విద్యార్థులకు ఐఐఎం సీట్లు దక్కించుకోవచ్చు. అన్ని అంశాలపై దృష్టిపెడితే సీటు పొందే అవకాశం ఉంది.