బీటెక్ విద్యార్థులకు త‌ప్ప‌ని నిరాశ.. వేసవి సెల‌వులు ర‌ద్దు

B.TECH Summer vacations are canceled.జేఎన్‌టీయూ ప‌రిధిలోని ఇంజినీరింగ్‌, ఫ్మార‌సీ విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్ట‌ర్ ఎం.మంజూర్ హుస్సేన్ తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 6:02 AM GMT
B.TECH Summer vacations

జేఎన్‌టీయూ ప‌రిధిలోని ఇంజినీరింగ్‌, ఫ్మార‌సీ విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్ట‌ర్ ఎం.మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఇంజినీరింగ్‌, బీఫార్మ‌సీ రెండు, మూడో ఏడాది సెమిస్ట‌ర్ టైమ్ టేబుల్‌ను స‌వ‌రించిన‌ట్లు చెప్పారు. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా-డి(రెగ్యుల‌ర్‌), ఫార్మా-డి(పీబీ) రెండో సెమిస్ట‌ర్‌లోనూ మార్పులు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో ఇచ్చిన షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 17 నుంచి 29 మ‌ధ్య వేస‌వి సెల‌వులు ఉంటాయ‌ని వ‌ర్సిటీ ప్ర‌క‌టించ‌గా.. ప్ర‌స్తుతం వాటిని ర‌ద్దు చేసి.. ల్యాబ్ ప్రాక్టీక‌ల్స్ నిర్వ‌హణ‌కు కేటాయిస్తున్న‌ట్లు రిజిస్ట్రార్ ఓ ప్ర‌క‌న‌ట‌లో వెల్ల‌డించారు. ఈ స‌మ‌యంలో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు కొన‌సాగించాల‌ని అనుబంధ గుర్తింపు పొందిన క‌ళాశాల‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

కొత్త షెడ్యూల్ ప్ర‌కారం బీటెక్‌, బీఫార్మ‌సీ రెండు, మూడు సంవ‌త్స‌రాల రెండో సెమిస్ట‌ర్ విద్యార్థుల‌కు మే 31 నుంచి జూన్ 5 మ‌ధ్య ఆన్‌లైన్ మిడ్ ట‌ర్మ్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. అనంత‌రం జూన్ 7 నుంచి జూలై 17 మ‌ధ్య రెండో ద‌శ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తారు. జూలై 19 నుంచి 24 వ‌ర‌కు రెండో మిడ్ ట‌ర్మ్ ప‌రీక్ష‌లు ఉండ‌నున్నాయి. జూలై 26 నుంచి ఆగ‌స్టు 14 మ‌ధ్య ప్రాక్టిక‌ల్స్ ఉంటాయి. అదే నెల 16 నుంచి 28 మ‌ధ్య సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఎంబీఏ, ఎంసీఎ, ఫార్మా డి 2,3,4,5 సంవ‌త్స‌రాల విద్యార్థుల‌కు జూలై 19 నుంచి 31 మ‌ధ్య సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.


Next Story
Share it